Land Crusiers : సీఎం కామెంట్స్ బయటకొచ్చిన వెహికిల్స్
22 క్రూజర్ల వ్యవహారంలో కీలక మలుపు
Land Crusiers : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ చేసిన నిర్వాకాన్ని వెలుగులోకి తీసుకు వచ్చారు. అభయ హస్తం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు.
Land Crusiers Viral
కేసీఆర్ చేసిన భాగోతాన్ని గుట్టు విప్పారు. మూడోసారి అధికారంలోకి వస్తానని చెప్పి ఏకంగా ప్రభుత్వ ఖజానాను దుబారా చేశాడని విమర్శించారు. ఒక్కో క్రూజర్ వాహనాన్ని రూ. 3.50 కోట్లు ఖర్చు చేసి ఏకంగా 22 వెహికిల్స్ ను కొనుగోలు చేశాడని ఈ విషయం తాను సమీక్షించిన సమయంలో బట్ట బయలు అయ్యిందంటూ చెప్పారు.
దీంతో రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన తాజా కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. గతంలో తెలంగాణ సర్కార్ లో పని చేసిన ఇంటెలిజెన్స్ , ఎస్ఐబీ చీఫ్ ఆదేశాల మేరకే విజయవాడకు వాహనాలను తరలించారంటూ సంచలన ఆరోపణలు గుప్పించారు సీఎం.
ఇదిలా ఉండగా 22 ల్యాండ్ క్రూజర్లు ఎక్కడ దాచి పెట్టారనే విషయం రాబట్టాలని డీజీపీని ఆదేశించారు రేవంత్ రెడ్డి. దీంతో ప్రస్తుత ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ విజయవాడలో దాచి పెట్టారని గుర్తించారు. ఈ మేరకు త్రినయన మోటార్స్ లో ఉన్న ల్యాండ్ క్రూజర్లు రెండు రోజుల్లో హైదరాబాద్ కు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం.
Also Read : Telangana Crime Rate : తెలంగాణలో నేరాల పెరుగుదల