Telangana Ex CM KCR: ఫిబ్రవరి నుండి జనంలోకి కేసీఆర్‌ ?

ఫిబ్రవరి నుండి జనంలోకి కేసీఆర్‌ ?

Telangana Ex CM KCR: తన ఫాం హౌస్ లో ప్రమాదవశాత్తూ జారిపడి తుంటి ఎముక గాయంతో బాధపడుతున్న తెలంగాణా మాజీ సిఎం కేసీఆర్… త్వరలో ప్రజల్లోకి వస్తారంటూ బిఆర్ఎస్ ముఖ్య నేత, ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. కేసీఆర్‌(KCR) ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఫిబ్రవరి నుంచి ఆయన సం పూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు వస్తారని, జిల్లాల్లో పర్యటిస్తారని, తెలంగాణ భవన్‌ కు వచ్చి కార్యకర్తలను కలుస్తారని హరీశ్‌రావు స్పష్టం చేసారు. తెలంగాణ భవన్‌ లో నిర్వహించిన పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు పలు కీలక విషయాలపై మాట్లాడారు. ఇటీవల ఎన్నికల్లో ఓటమి… బీఆర్ఎస్ కు ఓ స్పీడ్‌ బ్రేకర్‌లాంటిది మాత్రమేనని అన్న హరీష్… బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినప్పటికీ… ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారం వల్లే ఓడిపోయామని చెప్పారు. అంతేకాదు భవిష్యత్తులో బీఆర్ఎస్ కు మళ్లీ మంచిరోజులొస్తాయని ఈ సందర్భంగా కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.

Telangana Ex CM KCR – కేసీఆర్ గుర్తును తెలంగాణా ప్రజల గుండెల నుంచి మాత్రం తొలగించలేరు- హరీష్

కాంగ్రెస్‌ ప్రభుత్వం… కేసీఆర్‌ కిట్‌ మీద ఉన్న కేసీఆర్‌ గుర్తును చెరిపేస్తోందని, కిట్‌ మీద నుంచి తొలగించవచ్చేమోకానీ.. తెలంగాణ ప్రజల గుండెల నుంచి మాత్రం తొలగించలేరని అన్నారు. కేసీఆర్‌(KCR) ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ సర్కారు రద్దు చేస్తోందని, రద్దులు, వాయిదాలు అన్నట్లుగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఇప్పటికీ కొన్నిచోట్ల వడ్ల పైసలు పడలేదని, రైతుబంధు కూడా వేయలేదని రైతులు వ్యవసాయం ఎలా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోపే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందని జోస్యం చెప్పారు. తెలంగాణా రాష్ట్ర చరిత్రలో తొలిసారి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని… తమ సత్తా ఏంటో చూపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వస్తారని చెప్పడంతో కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రమాదవశాత్తూ జారిపడి గాయపడిన కేసీఆర్ కు… యశోద హాస్పిటల్ వైద్యులు హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేసారు. తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి, ఏపి సిఎం చంద్రబాబు, టీడిపి అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను పరామర్శించారు. అయితే సెక్యూరిటీ, ఇన్ ఫెక్షన్ కారణాల దృష్ట్యా సాధారణ కార్యకర్తలకు… కేసీఆర్ పరామర్శించే అవకాశం కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు దొరకలేదు. దీనితో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Also Read : YS Sharmila Invites : సీఎం రేవంత్ రెడ్డిని తన తనయుడి పెళ్ళికి ఆహ్వానించిన షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!