C-130J Night Landing in Kargil: కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌ పై C-130J విమానం నైట్ ల్యాండింగ్ !

కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌ పై C-130J విమానం నైట్ ల్యాండింగ్ !

C-130J Night Landing: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అరుదైన ఘనత సాధించింది. అత్యంత కఠినమైన కార్గిల్‌ పర్వతాల్లోని ఎయిర్‌స్ట్రిప్‌పై తొలిసారిగా C-130J విమానాన్ని రాత్రివేళ ల్యాండింగ్‌ చేసింది. రాత్రి 8 గంటలకు C 130 J విమానంలో ఇద్దరు పైలట్లు, స్టాండర్డ్ సిబ్బంది, నావిగేటర్, ఒక ఫ్లైట్ గన్నర్, ఒక ఫ్లైట్ ఇంజనీర్, ఇద్దరు ముగ్గురు సాంకేతిక సిబ్బంది, మరియు ఎనిమిది మంది గరుడ్ కమాండోలు, IAF యొక్క ప్రత్యేక దళాల క్రాక్ టీమ్‌తో జెడ్డా నుండి బయలుదేరింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం ఆయుధాలు మరియు సామగ్రితో పాటు బృందం రాత్రి ఆపరేషన్ కోసం నైట్ విజన్ పరికరాలు మరియు వ్యూహాత్మక ఫ్లాష్‌ లైట్‌లను తీసుకువెళ్లింది. అర్ధరాత్రి అత్యంత ప్రమాదకరంగా భావించే కార్గిల్(Kargil) ఎయిర్ స్ట్రిప్ పై విజయవంగంగా ఈ విమానాన్ని ల్యాండ్ చేసింది. ఇదే విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

సుమారు 8,800 అడుగుల ఎత్తులో భారత రక్షణ దళాలకు సవాలుగా ఉన్న హిమాలయ భూభాగంలో ఉన్న కార్గిల్(Kargil) ఎయిర్‌ స్ట్రిప్‌లో C-130J విమానం విజయవంతంగా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం భారత వైమానిక దళం మరియు దాని పైలట్ల యొక్క అద్భుతమైన సామర్థ్యాలను నొక్కి చెబుతుంది. అంతేకాదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన యొక్క సామర్ధ్యం, ఖచ్ఛితత్వం, ప్రణాళిక మరియు నైపుణ్యంతో సవాళ్లను అధిగమిస్తూ తన ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. జై భారత్, జై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ సోషల్ మీడియాలో నినాదాలు హోరెత్తుతున్నాయి.

C-130J Night Landing – భారత వాయుసేనలో బాహుబలి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు C-130J అత్యంత నమ్మకమైన విమానం. భారత వాయుసేనలో C-130J హెర్కులస్ విమానాన్ని… బాహుబలిగా అభివర్ణిస్తారు. వాయుసేన మొత్తం పన్నెండు C-130J విమానాలను వాడుతోంది. ఇవి హిండన్‌లోని 77 స్క్వాడ్రన్‌, 87 స్క్వాడ్రన్‌లో విధులు నిర్వహిస్తున్నాయి. 2020 నుండి క్లిష్టతరమైన ప్రాంతాలకు ముఖ్యంగా చైనా బోర్డర్ కు సైనిక బలగాలను, పరికరాలను, సామగ్రిని తరలించడంలో C-130J విమానాలు కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల ఉత్తరాఖండ్‌ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించే కార్యక్రమంలో ఇది చురుకైన పాత్ర పోషించింది. ఆ సమయంలో వాయుసేన రెండు C-130J విమానాలను విజయవంతంగా ఉత్తరాఖండ్‌ ఎయిర్‌ స్ట్రిప్‌పై ల్యాండింగ్‌ చేసింది. నాడు కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇవి భారీ ఇంజినీరింగ్‌ పరికరాలను అక్కడికి తరలించాయి.

తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-130J సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ మొదటిసారిగా రాత్రి సమయంలో కార్గిల్(Kargil) ఎయిర్‌స్ట్రిప్‌ లో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. మార్గమధ్యంలో టెర్రైన్ మాస్కింగ్‌ ని ఉపయోగించడం ద్వారా… ఈ ఎయిర్ ఫోర్స్ వ్యాయామం (ఎక్సర్ సైజ్) గరుడ్‌ ల శిక్షణా మిషన్‌ను కూడా రూపొందించింది. గత ఏడాది ఏప్రిల్‌లో సూడాన్‌లో డేరింగ్ నైట్ రెస్క్యూ మిషన్ కోసం కూడా IAF ఈ విమానాన్ని ఉపయోగించింది.

Also Read : Pension Certificate : పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ చివరి తేదీ

Leave A Reply

Your Email Id will not be published!