CM Revanth Reddy : సీఎం బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలని నేతలకు ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొదటి సభ

CM Revanth Reddy : ఐదు జిల్లాల సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ జరగనుంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో గ్రాండ్ మీటింగ్ నిర్వహించిన రేవంత్ రెడ్డి సీఎం(CM Revanth Reddy) అయిన తర్వాత తొలిసారి ఇంద్రవెల్లిలో సభ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక వనం వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు సూచించారు.

CM Revanth Reddy Orders

ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని
ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములే అన్నారు. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.వారంలో మూడు రోజులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సచివాలయంలో ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలను రెట్టింపు ఉత్సాహంతో ఎదుర్కోవాలని నేతలకు సూచించారు. సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు సాధించేందుకు ప్రయత్నించాలని నేతలకు సూచించారు. తెలంగాణలో 17లో 12 అసెంబ్లీ స్థానాలకు తగ్గకుండా సీట్లు గెలిసేలా కసరత్తు చేయాలనీ ఆదేశించారు.

Also Read : Minister Adimulapu Suresh: మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఎస్సీ కాదంటూ స్పందనలో ఫిర్యాదు !

Leave A Reply

Your Email Id will not be published!