DRI Officials Seizes Diamonds: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ. 6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీ పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రూ. 6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీ పట్టివేత
DRI Officials Seizes Diamonds: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు సుమారు రూ.6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ వెళ్ళేందుకు బోర్డింగ్ పాస్ తీసుకున్న ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం వచ్చిన డీఆర్‌ఐ(DRI) అధికారులు వారి లగేజీని క్షుణ్నంగా తనిఖీ చేయడంతో ఈ అక్రమ వజ్రాలు, విదేశీ కరెన్సీ రవాణా బట్టబయలయింది. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో… డీఆర్ఐ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని సామగ్రిని క్షుణ్నంగా తనిఖీ చేశారు.
DRI Officials Seizes Diamonds Viral
ఈ తనిఖీల్లో చాక్లెట్ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన సుమారు రూ.6 కోట్ల విలువైన డైమండ్స్, రూ. 9.83 లక్షల విదేశీ కరెన్సీ, లక్ష రూపాయల ఇండియన్ కరెన్సీను గుర్తించారు. అయితే వజ్రాలు, విదేశీ కరెన్సీకు సంబంధించి సరైన ఆధారాలు వారి వద్ద లేకపోవడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : Akhilesh Yadav: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వానంపై అఖిలేశ్ అసహనం !