Vundavalli Arun Kumar: ఉండవల్లితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ ! కారణం అదే ?

ఉండవల్లితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ భేటీ ! కారణం అదే ?

Vundavalli Arun Kumar: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల భర్త, ప్రముఖ ఇవాంజలిస్ట్‌, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌… మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో రాజమహేంద్రవరంలో భేటీ అయ్యారు. రాజమహేంద్రవరంలోని ఉండవల్లి నివాసానికి వెళ్ళిన బ్రదర్ అనిల్ కుమార్ కాసాపే రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం ఫిబ్రవరి 17న జరగబోయే తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఆహ్వాన పత్రికను ఉండవల్లికి అందజేసారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ… ‘‘మా అబ్బాయి పెళ్లి కార్డు ఇవ్వడానికి ఉండవల్లి ఇంటికి వచ్చాను. నేను పాలిటిక్స్‌కి దూరంగా ఉన్నాను. ఏసుప్రభు గురించి చెప్పడానికే మాత్రమే నేనున్నాను. రాజకీయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడను’’ అని బ్రదర్ అనిల్ కుమార్ తెలిపారు.

Vundavalli Arun Kumar – రాజకీయాల నుండి నేను రిటైర్ అయ్యాను- ఉండవల్లి అరుణ్ కుమార్

బ్రదర్ అనిల్ కుమార్ తో భేటీ అనంతరం మాజీ ఎంపీ అరుణ్ కుమార్(Vundavalli Arun Kumar) మీడియాతో మాట్లాడుతూ… “తన మీద గౌరవంతో పెళ్లికి పిలవడానికి మాత్రమే బ్రదర్ అనిల్ కుమార్‌ ఇంటికి వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనుషులు ఉంటారని… అదే కాంగ్రెస్ బలమని అన్నారు. అందరూ ఒకటైతే పార్టీ అవదని… మిలిటరీ అవుతుందని ఆయన స్పష్టం చేసారు. షర్మిల రాజశేఖర్‌రెడ్డి కూమార్తె… ఆమె కాంగ్రెస్ పార్టీ మెంబర్‌ గానే ఉన్నారని చెప్పారు. బహిష్కృత ఎంపీలను కాంగ్రెస్ పార్టీ తీసుకునే అవకాశం ఉందన్నారు. తాను పలువురిపై కేసులు వేశానని… ఈ విషయం కోర్టులో ఉందన్నారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయానని… కాబట్టి తనను తీసుకొనే అవకాశం కాంగ్రెస్‌ కు ఉండదని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.

వైఎస్ షర్మిల-బ్రదర్ అనిల్ కుమార్ ల వారసుడు వైఎస్ రాజారెడ్డి… అట్లూరి ప్రియ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. రాజారెడ్డి-ప్రియల నిశ్చితార్థం జనవరి 18న, వివాహం ఫిబ్రవరి 17న జరగనున్న విషయం కూడా తెలిసిందే. ఈ వివాహనికి సంబంధించిన బ్రదర్ అనిల్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ కుమార్ తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రదర్ అనిల్ కుమార్ శుక్రవారం నాడు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు తెలుస్తోంది.

Also Read : DRI Officials Seizes Diamonds: శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ లో రూ. 6 కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీ పట్టివేత

 

Leave A Reply

Your Email Id will not be published!