Chandrababu Case : చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసు క్వాష్ పిటిషన్ పై నేడే తీర్పు

ఉత్కంఠతో ఎదురు చూస్తున్న టీడీపీ క్యాడర్

Chandrababu Case : స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. హైకోర్టు తిరస్కరించిన ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సెక్షన్ 17ఏపై సుప్రీంకోర్టులో తీవ్ర చర్చ జరిగింది. ఈ తీర్పు ఏపీ రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం ఉంది.

Chandrababu Case Updates

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే… స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. మునుపటి విచారణ అక్టోబర్‌లో జరిగింది, అయితే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ విషయంలో కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు(Chandrababu) తరపు న్యాయవాదులు ఆర్టికల్ 17-ఎ వర్తిస్తుందని వాదిస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన కేసులు దాఖలు చేయకుండా నిరోధించడానికి ఈ నిబంధన వర్తిస్తుంది. అవినీతి నిరోధక చట్టంలోని ఈ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబుపై పెట్టిన అభియోగాలు శూన్యం అని అర్థం బాబు తరపు లాయర్లు వాదించారు.

చట్టంలోకి ఈ సెక్షన్ రాకముందే .. 2018లో నేరం జరిగింది కనుక చంద్రబాబు అరెస్టు విషయంలో 17-ఏ వర్తించదు.. అనేది ప్రభుత్వం తరఫున సీఐడీ వాదన. 2021లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదుతోనే ఎఫ్‌ఐఆర్ దాఖలైందని, చంద్రబాబు పేరు కూడా లేని ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరిగిందని.. అందుకే ఈ సందర్భంలో సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు వాదించారు. కాబట్టి, ఈ కేసులో సెక్షన్ 17-ఎ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17Aకి సంబంధించిన ఈ తీర్పు న్యాయ ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. ఈ కారణంగానే.. చంద్రబాబుతో పాటు దేశంలోని ఇతర రాజకీయవర్గాలన్నీ కూడా తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Also Read : AP PCC Gidugu Rudraraju: ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా ! షర్మిలకు లైన్ క్లియర్ ?

Leave A Reply

Your Email Id will not be published!