Pakistan Spy Arrested: ఐఎస్‌ఐ గూఢచారిని అరెస్ట్ చేసిన యూపీ ఏటీఎస్ !

ఐఎస్‌ఐ గూఢచారిని అరెస్ట్ చేసిన యూపీ ఏటీఎస్ !

Pakistan Spy Arrested: పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఐఎస్ఐ) కోసం పనిచేస్తున్న రష్యా దేశంలోని మాస్కో భారత రాయబార కార్యాలయ ఉద్యోగిని యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. అరెస్టయిన వ్యక్తి హాపూర్‌లోని షామహియుద్దీన్‌పూర్ గ్రామానికి చెందిన సతేంద్ర సివాల్‌ గా గుర్తించారు. నిందితుడు సతేంద్ర సివాల్‌… విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) గా ఉద్యోగం సంపాదించి రష్యా దేశంలోని మాస్కో భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నాడు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో తన ఉద్యోగాన్ని ఉపయోగించుకుని రక్షణ మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత సైనిక సంస్థల వ్యూహాత్మక కార్యకలాపాలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని ఐఎస్‌ఐకి చేరవేస్తున్నట్లు గుర్తించారు. భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్‌ నిఘా సంస్థకు అందజేస్తున్నాడని.. ప్రతిగా డబ్బు తీసుకొంటున్నట్లు ఏటీఎప్ యూనిట్ పసిగట్టింది. అంతేకాదు భారతదేశానికి సంబంధించిన రహస్య పత్రాలను సంగ్రహిస్తూ పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్లు ఏటీఎస్ గుర్తించింది.

Pakistan Spy Arrested Viral

ఈ నేపథ్యంలో విస్తృతమైన విచారణ, విశ్వసనీయ సమాచారం మేరకు సతేంద్ర సివాల్‌ ను అరెస్టు చేసిన ఉత్తరప్రదేశ్(UP) యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు… మీరట్‌ లోని ఏటీఎస్‌ ఫీల్డ్ యూనిట్‌ కు తరలించి విచారిస్తున్నారు. ఈ విచారణలో ఐఎస్‌ఐ కోసం గూఢచార కార్యకలాపాలలో పాల్గొన్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. సతేంద్ర సివాల్ 2021 నుండి మాస్కోలోని ఇండియన్ ఎంబసీలో ఇండియా సెక్యూరిటీ అసిస్టెంట్ (IBSA)గా పనిచేస్తున్నాడు. ఐఎస్‌ఐ హ్యాండ్లర్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉద్యోగులను డబ్బుతో ప్రలోభపెట్టి, భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రాబడుతున్నారని ఏటీఎస్‌కి ఇంటెలిజెన్స్ అందడంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఈ సమాచారం భారత్‌ అంతర్గత, బాహ్య భద్రతకు భారీ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో సతేంద్ర సివాల్ ను అరెస్ట్ చేసారు. ఏటీఎస్‌ అధికారులు అడిగిన ప్రశ్నలకు అతడు సరైన సమాధానాలు ఇవ్వనట్లు తెలుస్తోంది. అయితే తాను పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తున్నట్లు అంగీకరించాడు.

Also Read : Felicitation for Padma Awards Winners: పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణా సర్కార్ సన్మానం !

 

Leave A Reply

Your Email Id will not be published!