Kodi Katti Case: కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ కు బెయిల్‌ !

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్‌ కు బెయిల్‌ !

Kodi Katti Case: ఏపీలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌ కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. గురువారం జరిగిన విచారణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… నిందితుడు శ్రీనివాసరావుకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రూ. 25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని నిందితుడు శ్రీనివాసరావుకు స్పష్టం చేసింది. అంతేకాదు కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనద్దని నిందితుడు శ్రీనివాసరావుని హైకోర్టు ఆదేశించింది. సుమారు ఐదేళ్ళ పాటు రాజమండ్రి, విశాఖపట్నం సెంట్రల్ జైలులో మగ్గుతున్న నిందితుడు శ్రీనివాసరావు ఎట్టకేలకు బెయిల్ పై విడుదల కానున్నాడు. దీనితో హైకోర్టు తీర్పుపై కోడికత్తి శ్రీను కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Kodi Katti Case Updates

2018 అక్టోబర్‌ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌(AP CM YS Jagan) పై దాడి కేసులో జనిపల్లి శ్రీనివాస్‌ ను పోలీసుల అరెస్టు చేసారు. ఈ కేసు అప్పట్లో రాజకీయంగా సంచలనంగా రేపడంతో ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. న్యాయస్థానం నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని… దీనితో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఇటీవల తీర్పును రిజర్వు చేసింది. తాజాగా శ్రీనివాస్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : KTR-Rag Gopal : తీవ్ర దుమారం రేపిన కేటీఆర్, రాజగోపాల్ రెడ్డి మధ్య చర్చ

Leave A Reply

Your Email Id will not be published!