PM Surya Ghar : గుడ్ న్యూస్..దేశవ్యాప్తంగా వారికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అంటున్న ప్రధాని

వైరల్ అవుతున్న ప్రధాని మోదీ ట్వీట్

PM Surya Ghar : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక ప్రాజెక్టును ప్రకటించింది. ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) మంగళవారం ప్రకటించారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు. పీఎం సూర్య ఘర్: ‘ముప్త్ బిజిలి యోజన’ పథకాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ పథకానికి రూ.75,000 కోట్లు ఖర్చవుతుందని, ప్రతి నెలా 300 ఇళ్లకు ఉచిత విద్యుత్ అందజేస్తామని, తద్వారా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు చేరుతోందన్నారు.

PM Surya Ghar Scheme

“స్థిరమైన అభివృద్ధి మరియు ప్రజల శ్రేయస్సు కోసం పీఎం సూర్య ఘర్: ‘ముప్త్ బిజిలి యోజన’ ప్రారంభిస్తున్నాము. “ఈ ప్రాజెక్ట్ రూ. 75,000 కోట్లతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించడం ద్వారా కోటి ఇళ్లలో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

Also Read : YS Sharmila : నా మీద విమర్శలు కాదు..దమ్ముంటే నా ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

Leave A Reply

Your Email Id will not be published!