Guntur Diarrhea: గుంటూరులో డయేరియా మరణాలపై హైకోర్టు సీరియస్ !
గుంటూరులో డయేరియా మరణాలపై హైకోర్టు సీరియస్ !
Guntur Diarrhea : గుంటూరు నగరంలో విజృంభిస్తోన్న డయేరియాపై ఏపీ హైకోర్టు స్పందించింది. డయేరియా లక్షణాలతో మృతి చెందిన వారి వివరాలను పరిశీలించి సమగ్రమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర న్యాయాధికార సంస్థను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో న్యాయాధికార సంస్థ జడ్జి లీలావతి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం వారికి అందుతున్న చికిత్స, అనారోగ్యానికి గల కారణాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై నివేదికను కోర్టుకు సమర్పించనున్నారు.
Guntur Diarrhea Viral
గత పదిరోజులుగా గుంటూరు(Guntur) నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నలుగురు డయేరియా అనుమానిత లక్షణాలతో మృతి చెందారు. దీనితో నగరపాలక సంస్థ సరఫరా చేసే నీటిని తాగడానికి ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డయేరియా కేసుల సంఖ్య ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు వాస్తవాలను తొక్కిపెడుతున్నారంటూ టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.
Also Read : Pawan Kalyan: పార్టీ నిధికి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ !