Janasena: టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ – జనసేన నేత కందుల దుర్గేష్‌

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికల్లో పోటీ - జనసేన నేత కందుల దుర్గేష్‌

Janasena: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తులు కొలిక్కివస్తున్నాయి. గత మూడేళ్ళుగా బీజేపీ, జనసేన(Janasena) పొత్తులో ఉండగా… ఇటీవల రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డవలెప్ మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమహేంద్రవరం జైలులో ఉండగా… పరామర్శించడానికి వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తు ప్రకటించారు. అయితే టీడీపీతో పొత్తుకు బీజేపీ అంగీకరిస్తుందనే ధీమాతో ఆయన ముందస్తు ప్రకటన చేసారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండంతో ఇటీవల వేరువేరుగా ఢిల్లీ వెళ్ళిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు… బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. అయితే పొత్తు విషయంలో ఇంకా బీజేపీ నుండి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నేత కందుల దుర్గేష్ మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీచేస్తాయని ప్రకటించారు. అయితే బీజేపీ నుండి ఎలాంటి ప్రకటన రాకముందే… జనసేన నేతలు ఇలా బహిరంగంగా పొత్తును ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Janasena Alliance Viral

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంగళవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరంలోని పార్టీ ప్రాంతీయ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, రూరల్‌, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో భేటీ అయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత పార్టీనేత కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్‌ దిశానిర్దేశం చేశారని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయని ఆయన స్పష్టం చేసారు. రాజానగరం నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని పవన్‌ ఇప్పటికే ప్రకటించారు. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నుండి కూడా జనసేన అభ్యర్థి పోటీ చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also Read : Rajya Sabha Election: ఏకగ్రీవంగా తెలంగాణా రాజ్యసభ ఎంపీలు !

Leave A Reply

Your Email Id will not be published!