LRS 2020: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం !

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం !

LRS 2020: లేఅవుట్‌ క్రమబద్ధీకరణ కోసం తీసుకొచ్చిన పథకం 2020-ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చి 31 లోగా దరఖాస్తులకు లేఅవుట్‌ ల క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లే అవుట్‌లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతి వర్గాలకు చెందిన దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనుంది. సోమవారం ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వనల అనధికారిక అంచనాల ప్రకారం అందిన దరఖాస్తుల్లో అర్హమైన వాటిని క్రమబద్ధీకరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది.

LRS 2020 – ఎల్ఆర్ఎస్ ధరఖాస్తు దారులకు గుడ్ న్యూస్ !

రాష్ట్రంలో లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (LRS) కింద దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది గత మూడున్నరేళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. నగర, పురపాలికలు, పంచాయతీల పరిధిలో అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు 2020లో గత ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడంతో 25 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ మేరకు క్రమబద్ధీకరణను చేపట్టే క్రమంలో న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా 2020లో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించిన లేఔట్‌ లను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 31లోపు దరఖాస్తుదారులకు ఈ అవకాశం కల్పించనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ 25 లక్షల దరఖాస్తులకు మోక్షం కలగనుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే ఏమిటి ?

అనుమతి లేని లే అవుట్ల క్రమబద్ధీకరణకు తీసుకొచ్చిందే ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం). ప్రభుత్వ విధివిధానాలు పాటించకుండా నిర్మించిన లే అవుట్లు, అక్రమ స్థలాల్లో నిర్మించిన లే అవుట్లను అన్ అప్రూవుడ్ లే అవుట్లు అంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం… ఇలాంటి స్థలాలను తప్పకుండా క్రమబద్ధీకరించుకోవాలి. ఇందుకోసం 2020లో ఎల్ఆర్ఎస్-2020 (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020) పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఉద్దేశ్యం ఏమిటంటే ?

అధికారిక లేఅవుట్‌లో పది శాతం స్థలాన్ని ఖాళీగా వదలాల్సి ఉంటుంది. కానీ… అనధికారిక లే అవుట్లలో ఖాళీ స్థలం ఉంచరు. దీనితో జనావాసాల్లో సౌకర్యాలు సరిగా ఉండవని… అలాంటి లేఅవుట్లలోని ఇళ్ల స్థలాల నుంచి 0.14శాతం ఓపెన్‌ ల్యాండ్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. ఆ డబ్బుతో కొంత ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి… అనధికార లేఅవుట్‌ లోని కాలనీకి కేటాయించాలన్నది దీని ముఖ్య ఉద్దేశ్యం. అయితే జీహెచ్‌ఎంసీ ప్రణాళిక విభాగం ఎల్‌ఆర్‌ఎస్‌ను ఆదాయ వనరుగానే చూస్తోంది. ఇప్పటి వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినప్పటికీ… అందులో ఒక్క రూపాయిని కూడా ఉద్దేశించిన లక్ష్యం కోసం ఖర్చు చేయలేదు అనే విమర్శలు ఉన్నాయి.

Also Read : India – Pakistan: పాకిస్థాన్‌ కు నీళ్లు బంద్‌ చేసిన భారత్ !

Leave A Reply

Your Email Id will not be published!