Congress First Guarantee: ఏపీలో మొదటి గ్యారెంటీని ప్రకటించిన కాంగ్రెస్ !

ఏపీలో మొదటి గ్యారెంటీని ప్రకటించిన కాంగ్రెస్ !

Congress First Guarantee: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఏపీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత… కాంగ్రెస్ పార్టీకు ఏపీలో జీవం వచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో సక్సెస్ అయిన ఆరు గ్యారెంటీ పథకాల ద్వారా రానున్న ఎన్నికల్లో తలపడేందుకు కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ సిద్ధమౌతోంది. దీనిలో భాగంగా అనంతపురంలో ‘‘న్యాయ సాధన’’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మల్లికార్జున్ ఖర్గే, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, కాంగ్రెస్(Congress) ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘ఇందిరమ్మ అభయం’’ పేరుతో మొదటి గ్యారెంటీను AICC అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. తాము అధికారంలోనికి వస్తే మొదటి గ్యారెంటీగా ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తామని తెలిపారు.

Congress First Guarantee Viral

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ…. నేను ఇక్కడకు వచ్చింది శ్రీమంతుల కోసం కాదని… ఆంధ్ర రాష్ట్రంలోని పేదలకు ఒక పథకం గురించి చెప్పడానికి తాను వచ్చానని తెలిపారు. ఇందిరమ్మ ‘‘అభయం’’ గ్యారెంటీ ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్(Congress) గ్యారెంటీ ఇచ్చిందంటే అమలు చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ‘ఈ గ్యారెంటీ మా గుండెల్లో ఉంటుందని … మీ గుండెల్లో కూడా ఉండాలి’ అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గత 10 ఏళ్లుగా తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా ఆంధ్రకు రాలేదని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి దేశం గర్వించే గొప్ప నాయకుడిని అందించిందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. మహానాయకుడు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డిని ఈ రాష్ట్రానికి సోనియాగాంధీ అధ్యక్షురాలిగా చేశారని చెప్పారు. షర్మిల న్యాయకత్వాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ఏపీకు ఒకనాడు షర్మిల ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నటికీ రైతుల పక్షం, పేదల పక్షం, మహిళల పక్షమేనని వివరించారు.

Also Read : LRS 2020: ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం !

Leave A Reply

Your Email Id will not be published!