Gajendra Singh Shekhawat: ముగిసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కీలక భేటీ !

ముగిసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల కీలక భేటీ !

Gajendra Singh Shekhawat: వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపి నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్(Gajendra Singh Shekhawat) తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సీట్ల సర్ధుబాటు, ఎన్నికల వ్యూహాలపై సుమారు ఎనిమిది గంటల పాటు చర్చించారు. అనంతరం చర్చల సారాంశాన్ని గజేంద్ర షెకావత్ ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలకు నివేదించినట్లు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేన, బీజేపీలకు కలిపి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. దీనిలో జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్ధులను జనసేన అధిష్టానం ప్రకటించింది.

ఈ నేపధ్యంలో బీజేపీ అభ్యర్ధులను ఫైనల్ చేయడానికి కసరత్తును ముమ్మరం చేసింది. ఏఏ స్థానాల నుండి ఎవరెవరిని బరిలో దించాలని అనే దానిపై బీజేపీ అగ్రనాయకత్వంతో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం బీజేపీ జాబితాను విడుదల చేస్తారని అంతా భావించినప్పటికీ… దీనికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మరోసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Gajendra Singh Shekhawat – నిడదవోలు నుండి కందుల దుర్గేష్ పోటీ !

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ సీటుపై ఎట్టకేలకు పీఠముడి వీడింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియారిటీ, పార్టీ పట్ల విధేయతపై మొగ్గు చూపిన టీడీపీ అధిష్టానం… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒప్పించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం రూరల్ సీటును ఆశించిన కందుల దుర్గేష్ ను నిడదవోలును కేటాయించింది. దీనితో కందుల దుర్గేష్ నిడదవోలు నుండి పోటీ చేస్తున్నట్లు జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది.

Also Read : CM Revanth Reddy: కేసీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్ !

Leave A Reply

Your Email Id will not be published!