BRS MP List: తొమ్మిది మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ !
తొమ్మిది మంది లోక్ సభ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ !
BRS MP List: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలంగాణాలో అభ్యర్ధుల ఎంపికపై పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే 15 మంది అభ్యర్ధులను ఖరారు చేసింది. తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన మొదటి జాబితాలో నలుగురు ఎంపీ అభ్యర్ధులను ప్రకటించింది. దీనితో తెలంగాణాలో కీలకంగా ఉన్న బీఆర్ఎస్(BRS) కూడా పార్టీ అభ్యర్ధుల ఎంపికను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టులో మరో ఇద్దరి పేర్లను బీఆర్ఎస్ బుధవారం ప్రకటించింది. వరంగల్ లో ఎవరిని నిలబెడతారనే ఆసక్తి నడుమ.. మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు ఆ టికెట్ కేటాయించారు. దీనితో ఆ స్థానంపై సందిగ్ధం వీడినట్టైంది. అలాగే చేవెళ్ల నియోజకవర్గం నుంచి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌కు టికెట్ కేటాయించారు. దీనితో బీఆర్ఎస్ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్ధులు సంఖ్య తొమ్మిదికి చేరింది.
BRS MP List – 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే !
1) ఖమ్మం -నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్టీ)మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
4) పెద్దపల్లి(ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
5) మహబూబ్‌నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7) వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
8) జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ .
9) నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
Also Read : Electroal Bonds: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్బీఐ !