OTT Platforms: 18 ఓటీటీలపై నిషేదం విధించిన కేంద్రం !

18 ఓటీటీలపై నిషేదం విధించిన కేంద్రం !

OTT Platforms: అశ్లీల కంటెంట్‌ ను ప్రసారం చేస్తున్న పలు ఆన్‌ లైన్ వేదికలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అభ్యంతరకర కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న 18 ఓటీటీలను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అశ్లీల కంటెంట్ పై సంబంధిత ఆన్ లైన్ వేదికలకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ… వాటి ప్రసారాల్లో మార్పు రాకపోవడంతో 18 ఓటీటీ(OTT) ప్లాట్‌ఫామ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, 57 సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తొలగించిన యాప్‌ లలో ఏడు గూగుల్‌ ప్లేస్టోర్‌ లోవి కాగా… మూడు యాపిల్‌ యాప్‌ స్టోర్‌ లోనివిగా గుర్తించారు.

OTT Platforms Ban..

సోషల్ మీడియా ఖాతాల్లో ఫేస్‌బుక్‌ లో 12, ఇన్‌ స్టాగ్రామ్‌లో 17, ఎక్స్‌ లో 16, యూట్యూబ్‌ లో 12 ఉన్నట్లు తెలిపింది. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ దేశీయంగా ఉన్న 18 ఓటీటీ వేదికలు అసభ్యకర కంటెంట్‌ ను ప్రసారం చేస్తున్నాయని… వాటిపై చర్యలు ఉంటాయని ప్రకటించారు. తొలగించిన ఓటీటీలకు కోటికిపైగా డౌన్‌ లోడ్స్‌ ఉన్నట్లు తెలిపారు. ఇవి సోషల్‌ మీడియా ద్వారా అశ్లీల కంటెంట్‌ కు సంబంధించిన ట్రైలర్‌, దృశ్యాలు, వెబ్‌ లింక్‌ లను ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతి ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ కు 32 లక్షల వ్యూస్ ఉన్నట్లు తెలిపారు. భారత్‌ లో ఓటీటీ పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగా వెబ్‌ సిరీస్‌ లకు ఓటీటీ అవార్డులను ప్రవేశపెట్టామన్నారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వాటిపై తప్పక చర్యలుంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read : Sudha Murty: రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ‘సుధామూర్తి’ !

Leave A Reply

Your Email Id will not be published!