Pawan Kalyan: పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ ! స్వయంగా ప్రకటించిన జనసేనాని !
పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ ! స్వయంగా ప్రకటించిన జనసేనాని !
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై ఉత్కంఠ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సదర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని… ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. అయితే జనసేనాని ఎంపీ, ఎమ్మెల్యే రెండు స్థానాల నుండి పోటీ చేస్తారు అనే ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకటనతో ఆయన ఎక్కడ నుండి పోటీ చేస్తారు అనే దానిపై స్పష్టత వచ్చింది.
Pawan Kalyan Participate
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రకటించడంపై… వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) లో పోటీ చేసారు. ఆకస్మిక నిర్ణయం. నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానను అని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ… ఆర్టీవీ ట్వీట్ చేసారు. దీనితో ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రకటన… మరోవైపు ఆర్టీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే… తన సీటును త్యాగం చేయడమే కాకుండా…. పిఠాపురంలో జనసేనను గెలిపించి గిఫ్ట్ ఇస్తారని మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం ఇన్ చార్జ్ వర్మ అన్నారు. అయితే ఇటీవల కాలంలో పిఠాపురంలో స్థానికులకే నా ఓటు అంటూ బ్యానర్లు వెలిసాయి. ఈ బ్యానర్లు వెలియడం వెనుక మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉండగా… పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జ్ గా కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్ ను పార్టీ అధిష్టానం ఇటీవల నియమించింది. కాకినాడ ఎంపీ స్థానం చలమలశెట్టి సునిల్ కు కేటాయించడంతో… వంగా గీత ను ఈ సారి పిఠాపురం అసెంబ్లీ బరిలో దించడానికి వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేనలో చేరడానికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వెనుకంజ వేయడంతో… ఆయన్ను వైసీపీలోనికి ఆహ్వానించడానికి పిఠాపురం సీటును ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే వంగా గీతను సీఎంఓకు పిలిపించి ఒప్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు ముద్రగడ పద్మనాభం గురువారం కిర్లంపూడి నుండి విజయవాడ ర్యాలీగా వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే వివిధ భద్రతా కారణాల వలన ర్యాలీను విరమించుకుని… తాను ఒక్కడినే ఈ నెల 16 లేదా 17 తేదీల్లో వైసీపీలో చేరుతారని బహిరంగ లేఖలో ముద్రగడ తెలిపారు.
Also Read : Malla Reddy: కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి ?