Election Schedule 2024 : రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న ఈసీ…

ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది

Election Schedule 2024 : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికలు 2024, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రేపు (శనివారం) ప్రకటించబడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటన చేయనుంది. న్యూఢిల్లీలోని జ్ఞాన్ భవన్‌లో విలేకరుల సమావేశం జరగనుంది. ఈ మీడియా సమావేశం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ మేరకు “ఎక్స్ వేదికగా భారత ఎన్నికల సంగం ప్రతినిధి వెల్లడించారు.

Election Schedule 2024 Updates

ఎన్నికల తేదీలు ప్రకటించిన వెంటనే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే అధికార పార్టీ కొత్త రాజకీయ నిర్ణయాలేవీ తీసుకోలేవు. ప్రస్తుత పార్లమెంటు సభ్యుల పదవీకాలం జూన్ 16తో ముగుస్తుంది. ఈ తేదీలోగా కొత్త పార్లమెంటు ఏర్పాటు చేయాలి. కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 10న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.

Also Read : YS Sharmila: వైఎస్ వివేకా వర్ధంతి సభలో షర్మిల సంచలన వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!