Electroral Bonds : ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై స్పందించిన ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి
ఈరోజు అకస్మాత్తుగా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టడం లేదు
Electroral Bonds : హాట్ టాపిక్ గా మారిన రాజకీయ పార్టీలకు విరాళాల ఆర్థిక సాధనం ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్లను ఒక ప్రయోగంగా చూడాలని అన్నారు.
Electroral Bonds Issue
“ఈరోజు అకస్మాత్తుగా ఎలక్టోరల్ బాండ్లను ప్రవేశపెట్టడం లేదు. గతంలోనూ ఇలాంటి వ్యవస్థలు వచ్చాయి. మార్పు ప్రారంభమైనప్పుడు ఎల్లప్పుడూ ప్రశ్నలు తలెత్తుతాయి. ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్)ను ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలే అడిగారు’’ అని ఆదివారం అక్కడ మీడియాతో మాట్లాడుతూ హోసబాలే అన్నారు. కొత్త వ్యవస్థ ఎంత ఉపయోగకరంగా మరియు సమర్ధవంతంగా ఉందో కాలమే చెబుతుందని, దీన్ని ఒక ప్రయోగంగా చూడాలని ఆర్ఎస్ఎస్ భావిస్తోందని ఆయన అన్నారు.
Also Read : Kishan Reddy : అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది