Sadananda Gowda: కాంగ్రెస్‌ లోకి కర్ణాటక మాజీ సీఎం ?

కాంగ్రెస్‌ లోకి కర్ణాటక మాజీ సీఎం ?

Sadananda Gowda: లోక్ సభ ఎన్నికల నగరా మ్రోగిన వేళ కర్ణాటకలో బీజేపీకు గట్టి షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి డీవీ సదానంద గౌడ(Sadananda Gowda) పార్టీను వీడనున్నట్లు తెలుస్తోంది. బెంగళూరు నార్త్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురుకావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సదానంద గౌడ… త్వరలో కాంగ్రెస్‌ లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై స్పందించిన మాజీ సీఎం సదానంద గౌడ… తన తదుపరి రాజకీయ కార్యాచరణను మంగళవారం ప్రకటిస్తానని తెలిపారు. దీనితో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Sadananda Gowda Joined in Congress

సోమవారం సదానంద గౌడ పుట్టినరోజు సందర్భంగా ఆయన మద్దతుదారులు భారీ ఎత్తున సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం తరువాత ఆయన బీజేపీను వీడి… కాంగ్రెస్‌ లో చేరతారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ… తనను కాంగ్రెస్ నేతలు సంప్రదించారని వెల్లడించారు. ‘నాతో ఇతరులు, మా పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. మంగళవారం నా మనసులో మాట చెప్తాను. కొన్ని చర్యలతో నేను ఎంతో బాధకు గురయ్యాను’ అని గౌడ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు బెంగళూరు నార్త్‌ తో పాటు మైసూర్‌-కొడగు స్థానాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో ఆయన చేరడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read : AP News : బాపట్ల జిల్లా హైవేపై కొరిశపాడులో రెండు చోట్ల యుద్ధ నౌకల ట్రయల్ రన్

Leave A Reply

Your Email Id will not be published!