GHMC Mayor: కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి !
కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి !
GHMC Mayor: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలోని బీఆర్ఎస్ పార్టీకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కొంతమంది బీఆర్ఎస్ ను వీడి బీజేపీ, కాంగ్రెస్ లో చేరుతున్నారు. జంపింగ్ జపాంగ్ లతో సతమతమవుతన్న బీఆర్ఎస్ పార్టీకు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి కోలుకోలేని దెబ్బ వేసారు. తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ లోక్ సభ టిక్కెట్టు కేటాయించినప్పటికీ… బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
GHMC Mayor Joined in Congress
ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi)… బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి… సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు.
గులాబీ బాస్ కేసీఆర్ కు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత.. బీఆర్ఎస్ నేతలు హస్తం పార్టీలోకి క్యూ కడుతున్నారు. గత పదేళ్లుగా కేసీఆర్ వెంట నడిచిన నాయకులు పార్టీని వీడి పక్క పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే కే కేశవరావు, కడియం శ్రీహరి వంటి వారు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పగా… తాజాగా అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు పార్టీని వీడతారంటూ ప్రచారం జరగుుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువమంది గెలిచారు. దీంతో గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Bharat Ratna: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రదానం ! స్వీకరించిన పీవీ కుమారుడు !