Bharat Ratna: మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రదానం ! స్వీకరించిన పీవీ కుమారుడు !

మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ప్రదానం ! స్వీకరించిన పీవీ కుమారుడు !

Bharat Ratna: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం వేడుక శనివారం నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే తదితరులు హాజరయ్యారు.

Bharat Ratna to Former PM

పలు రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో ‘భారతరత్న’ ప్రకటించిన సంగతి తెలిసిందే. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌, బీజేపీ అగ్రనేత ఎల్‌.కె. అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు(PV Narasimha Rao), చౌదరీ చరణ్‌సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కు ఈ అత్యున్నత పురస్కారాలను ప్రకటించారు. ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా… నేడు వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌, చౌదరీ చరణ్‌ సింగ్‌ తరఫున ఆయన మనవుడు జయంత్‌ సింగ్‌, స్వామినాథన్‌ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం అద్వానీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ ప్రదానం చేయనున్నారు.

Also Read : Anand Mahindra : మహీంద్రా విశ్వవిద్యాలయానికి 500 కోట్లు విరాళం అందించిన ఆనంద్ మహీంద్రా

Leave A Reply

Your Email Id will not be published!