Criminal Case on KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు !

కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు !

Criminal Case on KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై హనుమకొండకు చెందిన కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనితో వారు కేసు నమోదు చేసి దానిని బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్సఫర్ చేసారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు మాజీ మంత్రి కేటీఆర్ పై ఐపీసీ సెక్షన్ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత… తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా కేటీఆర్ పై కూడా క్రిమినల్ కేసు నమోదు కావడం పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.

Criminal Case on KTR – కేటీఆర్ ఏమన్నారంటే ?

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అనుచిత వ్యాఖ్యలు చేసారు. సీఎం రేవంత్‌ రూ. 2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్‌ పెద్దలకు పంపాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ యేతర రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్ ఫండింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత బత్తిన శ్రీనివాస్‌ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు హన్మకొండలో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బంజారాహిల్స్‌ పోలీసులు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

Also Read : GHMC Mayor: కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్న జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి !

Leave A Reply

Your Email Id will not be published!