Nara Chandrababu Naidu: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ – చంద్రబాబు

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ - చంద్రబాబు

Nara Chandrababu Naidu: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు నిర్వహించానని… కాని సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు(Nara Chandrababu Naidu) అన్నారు. తాను అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పదవి ఉంటే ఒదిగి పనిచేసిన వ్యక్తి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. ప్రజలు జగన్‌ బెండ్‌ తీయడం ఖాయమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Nara Chandrababu Naidu Said

‘‘ప్రజాగళం సభలు జనంతో కళకళలాడుతుంటే… సీఎం జగన్ సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి. జగన్‌ ఓ విధ్వంసకారుడు, అహంకారి, అవినీతిపరుడు. రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశాం. తిరుపతి, చెన్నైలో విమానాశ్రయాలు ఉన్నాయి. నెల్లూరులో కూడా ఓ విమానాశ్రయం నిర్మించాలని భావించా. రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం. మనం పరిశ్రమలు తెస్తే వైసీపీ నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం కలిపి టెంపుల్‌ టూరిజం ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఎర్రచందనం స్మగ్లింగ్‌ పై ఉక్కుపాదం మోపాం. స్మగ్లర్లకు వైసీపీ టికెట్లు ఇచ్చింది.

టీడీపీ హయాంలో కోతలు లేని కరెంట్‌ ఇచ్చాం. ఎస్సీ ఎమ్మెల్యేలందరినీ మార్చడం జగన్‌ మార్క్‌ రాజకీయం. తన సామాజిక వర్గానికే డబుల్‌ ప్రమోషన్‌ ఇవ్వడం ఆయన మార్క్‌. ఐదేళ్లుగా గాడితప్పిన పాలనను మేం వచ్చాక సరిచేస్తాం. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాం. అభివృద్ధి అంటే పేదవాడి ఆదాయం పెరగాలి. మద్య నిషేధం అన్నారు… దానిపైనే రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు. మా హయాంలో సంక్షేమానికి 19.5 శాతం ఖర్చు చేశాం. వైకాపా హయాంలో సంక్షేమానికి 13.5 శాతం ఖర్చు చేశారు’’ అని విమర్శించారు.

Also Read : Criminal Case on KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు !

Leave A Reply

Your Email Id will not be published!