Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ప్రక్రియ !

Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతోపాటు డమ్మీ, ఇండిపెండెంట్‌ అభ్యర్ధులు భారీగానే నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈనెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.

Elections 2024 – తెలంగాణాలో 17 లోక్ సభ స్థానాలకు 547 నామినేషన్లు

ఏపీ(AP) అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతోపాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కు(ఉప ఎన్నిక) మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు 547 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో మొత్తం​ 29 నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఇక ఏపీలో ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు దాఖలయ్యాయి. 25 లోక్‌సభ స్థానాలకు 731 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు 4210. 25 లోక్ సభ స్థానాలకు 731 నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. గురువారం మధ్యాహ్నం 3గంటలతో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల కు నామినేషన్ల గడువు ముగిసిందని అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 4,210 మంది నామినేషన్లు వేశారు. కొన్ని చోట్ల చెదురు మదురు ఘటనలు మినహా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Also Read:AP High Court: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు !

Leave A Reply

Your Email Id will not be published!