Rahul Gandhi: ప్రజ్వల్ రేవణ్ణపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు !
ప్రజ్వల్ రేవణ్ణపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు !
Rahul Gandhi:కర్ణాటకలో 400 మందికి పైగా మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్ రేపిస్ట్ ప్రజ్వల్ రేవణ్ణ అంటూ జేడీ(ఎస్) సిట్టింగ్ ఎంపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయ్‌చూర్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొన్న రాహుల్… కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న ప్రజ్వల్ అశ్లీల వీడియోలపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘ ఈ సెక్స్ కుంభకోణం గురించి మోదీకి ముందే తెలుసు. తలచుకుంటే ప్రజ్వల్ ను సెకన్లలో అరెస్ట్‌చేసేవారు. సీబీఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్‌ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి ? ప్రజ్వల్ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి ?’’ అని ప్రధాని మోదీని రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిలదీశారు.
Rahul Gandhi:
‘‘అధికారం, కూటమి కోసం ప్రజ్వల్ ను కాపాడుతున్నారని కర్ణాటక మహిళలు గ్రహించారని రాహుల్ అన్నారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని, హోం మంత్రి ప్రజ్వల్‌ను రక్షిస్తున్నారు. ఇదే మాకు, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా. అధికారం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. ప్రజ్వల్ ఘటన తర్వాత కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు. రాష్ట్రంలో పాల్గొనాల్సిన అన్ని సమావేశాలు, ర్యాలీలను మోదీ రద్దుచేసుకున్నారు’’ అని అన్నారు.
‘‘ బాధితుల్లో మైనర్లూ ఉన్నారు. అంతా తెల్సి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మౌనంగా ఉన్నారు. నిజంగా ఇది నేరం. ఆయనపై కేసు నమోదుచేయాలి. రేపిస్ట్ కు మద్దతుగా ఓట్లు అడిగినందుకు దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లకు మోదీ క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్ చేసింది తెల్సి కూడా మీ ఓట్లను మోదీ అడిగారని కర్ణాటక మహిళలు గ్రహించాలి. బీజేపీ నేతలకు ప్రజ్వల్ రేపిస్ట్ అని ముందే తెలుసు. అయినాసరే ఆయనకు మద్దతు పలికి జేడీ(ఎస్)తో పొత్తు పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు.
Also Read :-Telangana Revenue Employees: 40 శాతం ఫిట్ మెంట్ కు తెలంగాణా రెవిన్యూ ఉద్యోగుల సంఘం డిమాండ్ !