AP Elections 2024: ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ! 76.50 శాతం పోలింగ్ నమోదు !
ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ! 76.50 శాతం పోలింగ్ నమోదు !
AP Elections 2024: ఏపీలో లోక్ సభ, శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గాను చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ పూర్తయింది. సోమవారం రాత్రి దాదాపు 10 గంటల వరకు సాగిన పోలింగ్ లో 76.50 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ పోలింగ్ ప్రక్రియలో 275 బీయూలు, 217 సీయూలు, 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. పోలింగ్ సమయం ముగిసిన తరువాత రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించి…. పోలింగ్ వివరాలను వెల్లడించారు.
AP Elections 2024 Updates
ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ…. ఓటరు జాబితా విషయంలో ఈ సారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగాయని, పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయి. 275 బీయూలు, 217 సీయూలు, 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు తలెత్తాయి. పోలింగ్ కేంద్రాల వద్ద 20వేల యంత్రాలు అదనంగా ఉంచాం. పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందింది. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలపై సమాచారం ఉంది. అందుకే, ముందుగానే తగిన ఏర్పాట్లు చేశాం. మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయి. ఇంజినీర్లు యంత్రాలను పరిశీలించి… డేటా వస్తుందని చెప్పారు. ఇదే నియోజకవర్గంలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించాం. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు’’ అని ఎంకే మీనా తెలిపారు.
Also Read : CM Revanth Reddy: విద్యార్ధులతో కలిసి ఫుట్ బాల్ అడిన సీఎం రేవంత్ !