Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత వైసీపీకు రెండో సారి పట్టం కడుతుంది – సజ్జల
ప్రభుత్వ సానుకూలత వైసీపీకు రెండో సారి పట్టం కడుతుంది - సజ్జల
Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని… ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ సానుకూలత, వైసీపీకు రెండో సారి పట్టం కడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తరువాత తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… ఓటు ఎవరికి వేయాలి అనే దానిపై ప్రజలు ముందుగానే స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే ఓటు వేసేందుకు ప్రజలు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా సానుకూల ఓటుతో పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. కూటమి నాయకులు, వారి అనుబంధ మీడియా… అధికార వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినప్పటికీ… ఎన్నికల్లో ప్రజలు మాత్రం వైసీపీ వెంటే నిలబడ్డారని ఆయన ధీమా వ్యక్తం చేసారు.
Sajjala Ramakrishna Reddy Comment
‘‘చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు తమ అరాచకత్వాన్ని ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి పలు చోట్ల దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది’’ అని సజ్జల చెప్పారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం’’అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
Also Read : AP Elections 2024: ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ! 76.50 శాతం పోలింగ్ నమోదు !