Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈరోజే కీలక విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే....

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారణను నిర్వహించనున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Delhi Liquor Scam Update

ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఈడీ, సీబీఐ కేసుల్లో మే 6న కవిత బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత పాత్రపై సాక్ష్యాలను చూపుతూ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించింది. లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత మార్చి 16న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read : Minister Bhatti Vikramarka : కేంద్రంలో రిజర్వేషన్లు ఎత్తిసేందుకు కుట్ర – మినిస్టర్ భట్టి

Leave A Reply

Your Email Id will not be published!