AP Welfare Schemes: ఏపీలో పలు ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు !

ఏపీలో పలు ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు !

AP Welfare Schemes: ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పథకాల పేర్లను మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖకు సంబంధించిన పలు పథకాల పేర్లన్నీ మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి వరకూ ఉన్న సంక్షేమ పథకాల పేర్లను… తన తండ్రి రాజశేఖరరెడ్డి, తన పేరున మార్చేసిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్ళుగా ఈ పథకాలన్నింటికీ జగనన్న, వైఎస్సార్ పేర్లతో అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో 2014 నుంచి 2019 వరకూ ఉన్న కొన్ని పథకాల పేర్లు కంటిన్యూ చేసి మరికొన్నింటికీ మార్పులు, చేర్పులు చేసింది. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా వీరాంజనేయులు స్వామి ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Welfare Schemes – పలు సంక్షేమ పథకాల పేర్లలో మార్పులు ఏమిటంటే ?

జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా పేరు మార్పు

జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్పు

వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా పునరుద్దరణ

వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు

జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు

Also Read : AP Secretariat: సచివాయంలో మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు !

Leave A Reply

Your Email Id will not be published!