Hajj Pilgrims : హజ్ యాత్రలో విషాదం..వడదెబ్బకు 90 మంది భారతీయులు దుర్మరణం

కాగా, తప్పిపోయిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది..

Hajj Pilgrims : అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటి వరకు హజ్ యాత్రలో 90 మంది భారతీయులు మరణించారు. వివిధ దేశాలకు చెందిన 645 మంది ఇప్పటివరకు మరణించారు. ఈ మరణాలలో ఎక్కువ భాగం వడదెబ్బ కారణంగా సంభవించాయి. చాలా మంది భారతీయులు అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 18.3 లక్షల మంది హజ్‌(Hajj)యాత్రలో పాల్గొన్నారు. హజ్ యాత్రలో మరణించిన వారిలో 300 మంది ఈజిప్షియన్లు ఉన్నారు. మక్కాలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి, వృద్ధులు వేడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 22 దేశాల నుంచి 16 వేల మంది ఈ యాత్రలో పాల్గొన్నారని హజ్ నిర్వాహకులు తెలిపారు. వివిధ కారణాలతో మరణించిన యాత్రికుల మృతదేహాలను మక్కాలోని అల్-ముయిసెమ్ ఆసుపత్రిలో ఉంచామని, వారిని వారి కుటుంబాలకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Hajj Pilgrims Death

కాగా, తప్పిపోయిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈజిప్టు ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా, ఇరాక్ మరియు కుర్దిష్ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. 240 మరణాలు నమోదవగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు రెట్లు ఎక్కువ మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియాకు చెందిన వారు. ఎడారి ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల హజ్ యాత్రకు వచ్చే యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముస్లింలు హజ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్రకు వెళ్లాలని కోరుకుంటారు.

Also Read : Deputy CM Pawan : మరికొన్ని గంటల్లో అసెంబ్లీలో అడుగుపెట్టనున్న జనసేనాని

Leave A Reply

Your Email Id will not be published!