Minister Jupally : పర్యాటక భవన అధికారులపై భగ్గుమన్న మంత్రి జూపల్లి
వెంటనే ఏడాదికి సంబంధించిన హాజరు జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు...
Minister Jupally : హిమాయత్ నగర్ పర్యాటక భవన్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ హాజరు వివరాలను పరిశీలించి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకపోవడం, హాజరు సరిగా లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతస్తుల వారీగా ఉద్యోగి, సిబ్బంది డేటాను ఆరా తీశారు. దర్శనానికి ఖాళీ కుర్చీలే ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు.
Minister Jupally Serious
వెంటనే ఏడాదికి సంబంధించిన హాజరు జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డారు. త్వరలో సిబ్బంది హాజరు, పనితీరుపై సమీక్షిస్తామన్నారు. బయోమెట్రిక్ విధానం అమలుకు సంబంధించి ఉన్నతాధికారులు తమ కింది అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా ఉన్న అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
Also Read : MLA Ganta Srinivasa Rao : పీఎం పాలెం లో ఉన్న టిడ్కో ఇళ్లను పరిశీలించిన గంటా