Gudem Mahipal Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు !
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు !
Gudem Mahipal Reddy: హైదరాబాద్‌లోని నిజాంపేటలో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో మహిపాల్ పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు సోదాలు చేశారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఈడీ సోదాల్లో విచారణలో భాగంగా ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని ఇంటి నుంచి వెంట పెట్టుకొని ఈడీ అధికారులు తీసుకెళ్లారు.
Gudem Mahipal Reddy…
అయితే తన ఇంట్లో జరిగిన ఈడీ సోదాలపై మహిపాల్ రెడ్డి(Gudem Mahipal Reddy) స్పందించారు. “ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి జరిగిన ఈడీ సోదాలన్నీ రాజకీయ కుట్రతోనే చేశారని ధ్వజమెత్తారు. సోదాలు చేసిన అధికారులకు పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు. తమ నివాసాల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ము ఏం దొరకలేదని స్పష్టం చేశారు. పనికి రాని జీరాక్స్ పేపర్లు తప్ప ఏం దొరకలేదని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ముఖ్య మంత్రి స్థాయి వారిపై కూడా ఈడీ దాడులు చేస్తుందన్నారు. అదే విధంగా తనను ఇబ్బంది పెట్టేందుకే సోదాలు జరిగాయని వివరించారు. తన వద్ద ఉన్న చెప్పులు కొన్న బిల్లును కూడా అధికారులకు ఇచ్చానని తెలిపారు నివాసాల్లో సామాన్యంగా మహిళలు ధరించే బంగారం తప్ప ఇంట్లో ఎలాంటివి అధికారులకు దొరకలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read : Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు !