Surrogacy Leaves: ఇకపై సరోగసీ తల్లులకు కూడా ఆరు నెలల ప్రసూతి సెలవు !
ఇకపై సరోగసీ తల్లులకు కూడా ఆరు నెలల ప్రసూతి సెలవు !
Surrogacy Leaves: ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సరోగసీ (అద్దెగర్భం) విధానంలో సంతానం పొందినట్లైతే ఇకపై 180 రోజుల సెలవు తీసుకోవచ్చు. ఈ మేరకు 50 సంవత్సరాల కిందట ప్రకటించిన సెంట్రల్ సివిల్ సర్వీసెస్(లీవ్) రూల్స్(1972)కు కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీ విధానంలో సంతానాన్ని పొందితే వారు 180 రోజుల మాతృత్వ సెలవులు పొందొచ్చు.
Surrogacy Leaves….
ఒకవేళ గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ కూడా ప్రభుత్వ ఉద్యోగిని అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇద్దరు సంతానం వరకే వీటిని పొందొచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అయిన కమిషనింగ్ ఫాదర్ కూడా మొదటి ఆరు నెలల్లోగా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు పొందడానికి కేంద్రం వీలు కల్పించింది. ఈ విధానం ద్వారా బిడ్డను పొందిన ప్రభుత్వ ఉద్యోగినికి ఇంతకాలం ఈ సదుపాయం అందుబాటులో లేదు.
Also Read : Deputy CM Pawan : జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభ నియమావళి పై అవగాహన కార్యక్రమం..