Bihar Bridge Collapse: బిహార్ లో బ్రిడ్జ్‌లు కూలడంపై కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్ !
బిహార్ లో బ్రిడ్జ్‌లు కూలడంపై కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్ !
Bihar Bridge: బిహార్ లో వరుసగా బ్రిడ్జ్ లు కూలిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో సుమారు 12 వంతెనలు కూలిపోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బిహార్ లో బ్రిడ్జి కూలిన(Bihar Bridge) ఘటనపై కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఈ ఘనటలపై కేంద్ర మంత్రి ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం రుతుపవనాల సమయం. రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. బ్రిడ్జ్‌లు కూలడానికి కారణం అదే. ఈ ఘటనలపై దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని మంత్రి వెల్లడించారు.
Bihar Bridge Collapse
ఇప్పటివరకు శివన్, సరన్, మధుబాణి, అరారియా, ఈస్ట్ చంపారన్, కృష్ణగంజ్ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. ఈ పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనికి సీఎం నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్ చేస్తోంది. ఈ విమర్శల వేళ… రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలపై సర్వే నిర్వహించి, తగిన మరమ్మతులు చేయాలని నీతీశ్ ఆదేశాలు జారీ చేసినట్లు డిప్యూటీ సీఎం చౌదరి తెలిపారు. వంతెనల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను తయారు చేయాలని సూచించినట్లు తెలిపారు.
భారీ వ్యయంతో నిర్మించిన వంతెనలు స్వల్ప వ్యవధిలోనే కుప్పకూలుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ… వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న గుత్తేదారులు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజినీర్లే వర్కు లో నాణ్యత లేకపొవడమే ఈ ఘటనలకు కారణమని ప్రాథమికంగా నిర్ధరించారని తెలిపారు. గుత్తేదారులకు అప్పగించిన పనులను సరిగా నిర్వర్తించలేదని, అదే సమయంలో ఇంజినీర్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు.
Also Read : Bandla Krishna Mohan Reddy: బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్ ! కాంగ్రెస్ లోకి సిట్టింగ్ ఎమ్మెల్యే జంప్ !