Nara Lokesh: ఈ మెయిల్ ద్వారా వినతులు స్వీకరించనున్న మంత్రి నారా లోకేశ్‌ !

ఈ మెయిల్ ద్వారా వినతులు స్వీకరించనున్న మంత్రి నారా లోకేశ్‌ !

Nara Lokesh: సమస్య ఏదైనా, ఎలాంటి సహాయం కావాలన్నా ఇకనుంచి వాట్సప్‌ ద్వారా కాకుండా hello.lokesh@ap.gov.in మెయిల్‌కు పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలపై వాట్సప్‌ మెసేజ్‌లు పంపుతుండడంతో మంత్రి వాట్సప్‌ ను మాతృసంస్థ మెటా బ్లాక్ చేసింది. వేలాది మంది తమ సమస్యలను వాట్సప్ చెయ్యడం వల్ల సాంకేతిక సమస్యతో బ్లాక్ అయినట్లు మంత్రి నారా లోకేశ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనితో వాట్సాప్ కు బదులుగా hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీ ద్వారా ప్రజలు తనకు సమాచారం, సమస్యలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. తానే అందరి సమస్యలు నేరుగా చూస్తానని స్పష్టం చేశారు.

Nara Lokesh Comment

పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య-సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. యువగళం పాదయాత్రలో నిర్వహించిన ‘హలో లోకేశ్‌’ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడీని లోకేశ్‌ క్రియేట్ చేసుకున్నారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే నారా లోకేష్(Nara Lokesh) ప్రకటించారు.

ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రజా దర్బార్ ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. అదే సమయంలో తన వాట్సప్‌ కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్య తీసుకెళితే చాలు పరిష్కారం అయిపోతుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్‌కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడి hello.lokesh@ap.gov.in కి సమస్యలన్నీ పంపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read : Tirumala: తిరుమల క్యూలైన్‌ లలో ఆకతాయిల ప్రాంక్‌ వీడియో ! దర్యాప్తుకు ఆదేశం !

Leave A Reply

Your Email Id will not be published!