Nara Lokesh: ఖతార్ లో చిక్కుకున్న తెలుగు యువకుడికి నారా లోకేష్ భరోసా !

ఖతార్ లో చిక్కుకున్న తెలుగు యువకుడికి నారా లోకేష్ భరోసా !

Nara Lokesh: ఏజెంట్ల చేతిలో మోసపోతూ ఎంతో మంది తెలుగువాళ్లు విదేశాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మద్య కాలంలో కువైట్‌లో చిక్కుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేశారు. కువైట్‌లోని భారత రాయబారం కార్యాలయంతో మాట్లాడి ఆ యువకుడిని స్వదేశానికి తీసుకొచ్చారు. తాజాగా ఏపీకి చెందిన మరో వ్యక్తి సౌదీ అరేబియా ఏడారిలో చిక్కుకున్నానంటూ ఓ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఏజెంట్ చేతిలో మోసపోయానని.. తన పరిస్థితి బాగోలేదంటూ.. ఎవరైనా సాయం చేయాలంటూ ప్రధేయపడ్డాడు. ఈ వీడియో చూసిన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) తక్షణమే స్పందించారు. ధైర్యంగా ఉండాలని.. వీరేంద్ర కుమర్ ను స్వదేశానికి తీసుకొచ్చే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చారు. డోంట్‌వర్రీ.. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొస్తామని లోకేష్ ట్వీట్ చేశారు..

Nara Lokesh – ఈ వీరేంద్ర కుమర్ ఎవరు..

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాకు చెందిన సరేళ్ల వీరేంద్ర కుమార్ స్వస్థలం అంబాజీపేట మండలం ఇసుకపూడి. ఉపాధి కోసం ఏజెంట్ మాటలు నమ్మి ఖతర్ వెళ్లాడు. ఖతర్‌లో మంచి ఉద్యోగం ఉందని చెప్పడంతో వీరేంద్ర కుమార్ వీసా కోసం ఏజెంట్‌కు రూ.1,70,000 చెల్లించాడు. వీరేంద్రకుమార్ డబ్బులు కట్టడంతో ఖతర్‌కు వీసా ఇప్పించాడు. ఈనెల 10న వీరేంద్ర ఖతర్ చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓ వ్యక్తి 11వ తేదీన సౌదీ అరేబియా ఏడారి ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు. దీంతో తాను మోసపోయానని వీరేంద్ర గుర్తించాడు. చివరికి తన దగ్గర ఉన్న ఫోన్‌లో వీడియో తీసి తన కుటుంబ సభ్యులకు పంపించాడు. దీనిని మిత్రుల సహాయంతో సోషల్ మీడీయా లో పోస్ట్ చేయడంతో నారా లోకేష్ దీనిని చూశారు. వెంటనే స్పందించిన లోకేష్ వీరేంద్రను స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Also Read : CM Revanth Reddy: ఆగస్టులో సీఎం రేవంత్‌ రెడ్డి అమెరికా టూర్‌ !

Leave A Reply

Your Email Id will not be published!