YS Jagan: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది – వైఎస్‌ జగన్‌

రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది - వైఎస్‌ జగన్‌

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందని… కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan) ఆరోపించారు.ఇటీవల నంద్యాల, జగ్గయ్యపేటలో వైసీపీ నాయకుల హత్యలను ఉదహరిస్తూ… మాజీ సీఎం వైఎస్ జగన్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు.

YS Jagan Comment

‘‘పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

‘‘ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Also Read : Rakesh Reddy: జాబ్ క్యాలెండర్ పై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విసుర్లు !

Leave A Reply

Your Email Id will not be published!