KTPS: కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్లను కూల్చివేశారు !

కేటీపీఎస్‌లో 8 కూలింగ్‌ టవర్లను కూల్చివేశారు !

KTPS: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్‌లో ఓ అండ్‌ ఎం కర్మాగారం కూలింగ్‌ టవర్ల చారిత్రక ప్రస్థానం ముగిసింది. 8 కూలింగ్‌ టవర్లను అధికారులు కూల్చివేశారు. కాలం చెల్లడంతో 2020 ఏప్రిల్‌ 11న కర్మాగారం మూతపడింది. కూలింగ్‌ టవర్లు ఉన్న ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఉద్దేశంతో వాటిని కూల్చివేయాలని కేటీపీఎస్‌ నిర్ణయించింది. ఈ క్రమంలో 2023 జనవరి 18 నుంచి పాత కర్మాగారానికి సంబంధించిన టవర్ల కూల్చివేత పనులు మొదలయ్యాయి.

KTPS….

రాజస్థాన్‌లోని జైపూర్‌నకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ఈ ప్రక్రియను పుర్తి భాధ్యత చేపట్టింది. ట్రాన్స్‌కోతో పాటు జిల్లా కలెక్టర్‌ అనుమతులు పొందిన అనంతరం కూల్చివేత చేపట్టారు. 30 మంది సిబ్బంది సుమారు నెలరోజుల పాటు కసరత్తు చేశారు. మొత్తం మూడు దశల్లో కూల్చివేత కొనసాగింది. తొలుత ‘ఎ’ స్టేషన్‌లోని 102 మీటర్ల ఎత్తు కలిగిన నాలుగు కూలింగ్ టవర్లు కూల్చివేశారు. ఆ తర్వాత 115 మీటర్ల ఎత్తుగల నాలుగు టవర్లను రెండు దశల్లో నేలమట్టం చేశారు. ఇంప్లోషిన్‌ అనే పేలుడు పదార్థాన్ని దీనికోసం వినియోగించారు. కూల్చిన కూలింగ్‌ టవర్ల ప్రాంతాన్ని శుభ్రం చేయనున్నారు. అనంతరం ఆ ప్రదేశం కేటీపీఎస్‌కు ఉపయోగపడనుంది.

Also Read : BRS Party : బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటున్న కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!