Hema Malini: పతకం ఖాయమనుకున్న అభిమానుల మనసు ముక్కలైంది
పతకం ఖాయమనుకున్న అభిమానుల మనసు ముక్కలైంది
Hema Malini: సెమీ ఫైనల్‌లో విజయం.. ఫైనల్‌లో పతకం సాధించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో భారతీయ క్రీడాభిమానులకు ఊహించని షాక్.. భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు. 50 కిలోల విభాగంలో 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందంటూ ఒలంపిక్ సంఘం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది.
Hema Malini – కష్టమంతా వృథా..
పతకం ఖాయమనుకున్న అభిమానుల మనసు ముక్కలైంది. బరువు నియంత్రణ కోసం వినేశ్ ఎంతగానో కష్టపడింది. నీళ్లు తాగకుండా నిద్రను త్యాగం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. విజయానికి అడుగు దూరంలో ఉన్న ఆమెను 100 గ్రాముల కోసం రేసులోనే లేకుండా చేయడమేంటని యావత్ భారత క్రీడాభిమానులు విచారం వ్యక్తం చేశారు.
కానీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని(Hema Malini) మాత్రం ఈ అంశంపై విభిన్నంగా స్పందించారు. 100 గ్రాముల అధిక బరువు వల్ల అనర్హతకు గురవడం వింతగా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనందరికీ ఓ గుణపాఠం. ఆమె త్వరగా 100 గ్రాముల బరువు తగ్గాలని ఆశిస్తున్నాను. అయినా ఇప్పుడు ఒలంపిక్ పతకమైతే రాదు కదా అని చివర్లో సెటైరికల్‌గా ఓ నవ్వు విసిరింది.
ఆమె రియాక్షన్ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ‘ఒక క్రీడాకారిణి మీద అలాంటి కామెంట్లు చేయడమేంటి? పైగా చివర్లో ఆ నవ్వు చూశారా?’, ‘బరువు తగ్గడం గురించి లెక్చర్ ఇవ్వాల్సిన సమయమా ఇది’, ‘ఒక ఛాంపియన్ వైఫల్యాన్ని చూసి తను ఎలా నవ్వుతుందో చూశారా?’, ‘వినేశ్‌పై వేటు వేసినందుకు తెగ సంతోషిస్తున్నట్లు ఉంది’ అని ఆగ్రహంతో కామెంట్లు చేస్తున్నారు.
Also Read : Rahul Gandhi: వయనాడ్ విషాదం లో వందలాది మంది మృతి చెందారు.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి