Californium: బిహార్‌ లో రూ.850 కోట్లు విలువైన 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం !

బిహార్‌ లో రూ.850 కోట్లు విలువైన 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం !

Californium: బీహార్ లో అత్యంత విలువైన రేడియోధార్మిక పదార్ధం కాలిఫోర్నియం(Californium)ను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి సుమారు రూ.850 కోట్లు విలువైన 50 గ్రాముల కాలిఫోర్నియం స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్‌ నుంచి మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు దీనిని తీసుకొస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో గోపాల్‌గంజ్‌ జిల్లా పోలీసులు.. బల్త్‌హారి చెక్‌పోస్టు వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. బిహార్‌ లోని గోపాల్‌గంజ్‌ జిల్లా పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు. ఈ సందర్భంగా చోటే లాల్‌ ప్రసాద్, చందన్‌ గుప్తా, చందన్‌రామ్‌ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరు ఈ రేడియోధార్మిక పదార్థాన్ని విక్రయించేందుకు కొన్ని నెలలుగా యత్నిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. దాదాపు 50 గ్రాముల బరువున్న ఈ పదార్థం విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.850 కోట్లకుపైగా ఉంటుందని జిల్లా ఎస్పీ స్వర్ణ్‌ ప్రభాత్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ స్వర్ణ్ ప్రభాత్ మాట్లాడుతూ…‘‘మా జిల్లా నుంచి విలువైన రేడియో ధార్మిక పదార్థాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. గురువారం ఉత్తర్‌ప్రదేశ్‌-బిహార్‌ సరిహద్దుల్లో మోటార్‌ సైకిల్‌పై వస్తున్న నిందితులను తనిఖీ చేయగా.. నాలుగు మొబైల్‌ ఫోన్లతోపాటు 50 గ్రాముల కాలిఫోర్నియం(Californium) దొరికింది. వారిని అరెస్ట్ చేసి… కాలిఫోర్నియంను సీజ్ చేసాము. ఈ కాలిఫోర్నియం అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠాను పట్టుకునేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు.

Californium – ఈ కాలిఫోర్నియంను ఎందుకు ఉపయోగిస్తారంటే ?

కాలిఫోర్నియంను పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్లలో వినియోగిస్తారు. వీటితో బంగారం, వెండి ఇతర విలువైన లోహాలను గుర్తించవచ్చు. దీనితోపాటు ఇంధన బావుల్లో నీరు, చమురు పొరలను గుర్తించేందుకు వాడతారు. విమానాల్లో లోహాల అరుగుదల అంచనాకు కూడా వినియోగించవచ్చు. కాల్నిఫోర్నియం ఒక్కో గ్రాము ధర రూ. 17 కోట్లు పలుకుతుందని, ఇందుకు సంబంధించి వారి వద్ద ఉన్న టెస్ట్‌ రిపోర్టులను కూడా ఉన్నాయి. కాలిఫోర్నియంను పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్లలో ఉపయోగిస్తారు. మరోవైపు, రాజస్థాన్‌లోని అనూపఘర్‌ జిల్లాలో పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద హెరాయిన్‌ ప్యాకెట్‌ ను మోసుకొని వస్తున్న డ్రోన్‌ను బీఎస్ఎఫ్‌ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Natwar Singh: మాజీ కేంద్రమంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత !

Leave A Reply

Your Email Id will not be published!