Lucknow Airport : లక్నో ఎయిర్ పోర్ట్ లో రేడియో సంబంధిత పరికరాల కలకలం
లక్నో ఎయిర్ పోర్ట్ లో రేడియో సంబంధిత పరికరాల కలకలం..
Lucknow Airport : విమానాశ్రయంలో రేడియా ధార్మిక పదార్ధాల గుర్తింపు ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. లక్నోలోని చౌధరి చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-3 కార్గో ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం రొటీన్ తనిఖీల సమయంలో రేడియా ధార్మిక పదార్ధాలను అధికారులు గుర్తించారు. పార్సిల్ స్కానింగ్ సమయంలో అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది.
Lucknow Airport Got Radio..
కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, గాయపడటం కానీ జరగలేదని, విమానాశ్రయ కార్యకలాపాలకు కూడా ఎలాంటి ఆటంకం కలగలేదని ఎయిర్పోర్ట్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఫ్లోరిన్ కంటైనింగ్ మెడిసన్ ప్యాకేజీ నుంచి ఈ లీకేజ్ జరిగిందని, లీకేజ్‌ను అరికట్టి, భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని చెబుతున్నారు. ఫ్లోరిన్ లీకేజ్ వల్ల మంటలు చెలరేగడం, పేలుడు సంభవించడం, ఫ్లోరిన్ పీలిస్తే ప్రాణాలు కోల్పోవడం, ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. శరీరచర్మం, కళ్లు దెబ్బతినడంతో పాటు శ్వాససంబంధిత సమస్యలు ఎదురవుతాయి.
Also Read : Ganesh Chaturthi : వినాయక చవితి నిమజ్జనం పై సమీక్షించిన మంత్రి పొన్నం