Kolkata: కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆసుపత్రి విధ్వంసం.. ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

కోల్‌కతా ఆర్‌జీ కార్‌ ఆసుపత్రి విధ్వంసం.. ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు

Kolkata: కోల్‌కతాలో జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్‌ ఆసుపత్రిలో గత బుధవారం అర్ధరాత్రి దుండగులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసు అధికారులను కోల్‌కతా(Kolkata) పోలీసు విభాగం బుధవారం సస్పెండ్‌ చేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వారిపై చర్యలు తీసుకుంది. ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రి వద్ద విధుల్లో ఉన్న ఇద్దరు ఏసీపీలు, ఒక ఇన్‌స్పెక్టర్‌పైన వేటు వేసింది.

Kolkata Junior Doctor…

హత్యాచారానికి వ్యతిరేకంగా ఒకవైపు నగరమంతా నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు ముసుగులు ధరించిన విధ్వంసకారులు కర్రలు, ఇటుకలు, రాడ్లతో ఆసుపత్రి ఆవరణలోకి దూసుకొచ్చి గత బుధవారం దాడులు చేశారు. అత్యవసర గది, నర్సింగ్‌ స్టేషన్, మందుల దుకాణం, ఔట్‌ పేషంట్‌ విభాగాలతో (ఓపీడీ)పాటు సీసీ టీవీలను ధ్వంసం చేశారు. దాడికి పాల్పడినవారిలో ఇప్పటివరకూ పలువురిని అరెస్టు చేశారు. అర్థరాత్రి సుమారు 40 మంది వరకూ నిరసనకారుల రూపంలో వచ్చిన దుండగులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారని, వీరి దాడిలో ఓ పోలీసు వాహనం సహా మరికొన్ని ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనల నుంచి దృష్టి మళ్లించడానికే విధ్వంసానికి పాల్పడ్డారని నిరసనకారులు ఆరోపించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలు ఒక్కసారిగా ఇలా హింసాత్మకంగా మారతాయని అంచనా వేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు.

Also Read : MLA Harish Rao : ఆ సొమ్మును అన్ని జిల్లాల ఉద్యోగులకు అందించండి

Leave A Reply

Your Email Id will not be published!