Minister BC Janardhan : అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీ దుర్ఘటన పై స్పందించిన మంత్రి

కాగా.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు...

Minister BC Janardhan : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరమని రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఈ ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించడం జరిగిందన్నారు. క్షతగాత్రులను కూడా ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీ యాజమాన్యంపై ఇప్పటికే ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని మంత్రి బీసీ జానర్ధన్ రెడ్డి(Minister BC Janardhan) పేర్కొన్నారు.

Minister BC Janardhan Comment

కాగా.. అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోదీఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. కేజీహెచ్‌లో మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని..భాదితులకు అండగా ఉంటుందని తెలిపారు.

Also Read : Union Minister George Kurian: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కేంద్ర మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!