Ram Chander: కలలో కనిపించి మందలించిన సీఎం : రామ్ చందర్

కలలో కనిపించి మందలించిన సీఎం : రామ్ చందర్

Ram Chander: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కలలో కనిపించి.. రామ్ చందర్(Ram Chander) వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ తో పాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన కొద్ది రోజులకే కౌన్సిలర్ రామ్ చందర్ మనస్సు మార్చుకున్నారు. ఆయన మళ్లీ ఆప్‌లో తిరిగి చేరారు. మనీశ్ సిసోడియాతోపాటు ఆ పార్టీ కీలక నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం రామ్ చందర్ మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీలో తాను చిన్న సైనికుడినని స్పష్టం చేశారు. ఆప్ వదిలి మరో పార్టీలో చేరడం తాను తీసుకున్న తప్పు నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

Ram Chander …

నిన్న రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) తన కలలో కనిపించి.. రామ్ చందర్ వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్‌లతోపాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు. దీంతో తన నిర్ణయం మార్చుకున్నానని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ మాటలను ఎప్పటికి మారువనని ఈ సందర్బంగా ఆయన చెప్పారు.

అలాగే ఈ పార్టీలోనే తాను జీవిత కాలం కొనసాగుతానని ఈ సందర్భంగా రామ్ చందర్ ప్రమాణం చేశారు. రామచందర్ గతంలో.. బావన అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన ప్రస్తుతం వార్డ్ 28 నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు రామ్ చందర్ తిరిగి పార్టీలో చేరడంపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. పాత మిత్రుడు, ఆమ్ ఆద్మీ పార్టీ సహచరుడు రామ్ చందర్ ఈ రోజు తనను కలిశాడు. అతడు తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

ఇంకోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అలాంటి వేళ.. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు భారీగా పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో గురువారం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం రాజీవ్ భవన్‌లో ఆ పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ సమక్షంలో ఆ యా పార్టీల నేతలు అధిక సంఖ్యలో చేరారు.

Also Read : HYDRA: జన్వాడ ఫాంహౌస్‌కు అనుమతుల్లేవ్‌.!

Leave A Reply

Your Email Id will not be published!