Operation Bhediya: కొనసాగుతున్న ఆపరేషన్ భేడియా ! పట్టుబడిన ఐదో తోడేలు
కొనసాగుతున్న ఆపరేషన్ భేడియా ! పట్టుబడిన ఐదో తోడేలు
Operation Bhediya: యూపీలోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు టెర్రెస్తుంది. వాటిని పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ భేడియా(Operation Bhediya) కు మరో విజయం దక్కింది. మంగళవారం ఉదయం అటవీశాఖ అధికారులు మరొక తోడేలును బంధించారు. దీంతో స్థానికులను వణికిస్తోన్న ఆరు తోడేళ్ల గుంపులో ఐదు చిక్కినట్లయింది. బహరాయిచ్‌లోని హరబక్ష్ పూర్వ గ్రామంలోని ఘఘర నది సమీపంలో ఈ తోడేలు చిక్కిందని అధికారులు తెలిపారు. అంతకుముందు మరొకదాన్ని కూడా ఇక్కడే బంధించారు. ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది.
Operation Bhediya in UP
ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గుంపులో ఇంకొకదాన్ని బంధించాల్సి ఉందని ప్రకటించారు. వీటివల్ల సుమారు రెండు నెలలుగా బహరాయిచ్‌లోని 35 గ్రామాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. అటవీ విభాగం అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి రాత్రిపూట ఈ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ జీవాల దాడుల్ని ‘వైల్డ్‌లైఫ్ డిజాస్టర్’గా ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ వన్యప్రాణుల వల్ల 10 మరణాలు సంభవించాయి. అందులో తొమ్మిది మంది చిన్నారులే ఉన్నారు. 35 మంది గాయపడ్డారు.
ఈ జీవాలను పట్టుకునేందుకు అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రంగురంగుల బొమ్మలకు చిన్నారుల దుస్తులు వేసి.. వాటిని పిల్లల మూత్రంతో తడిపి తోడేళ్లు ఉండే గుహలు, నదీ ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్నారు. మనిషి వాసనలా భ్రమింపజేసి వాటిని ఉచ్చులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : Kedarnath Landslide: కేదార్నాథ్ యాత్రా మార్గంలో ప్రమాదం: నలుగురు మృతి