Virat Kohli : సచిన్ కంటే అరుదైన రికార్డు సాధించిన విరాట్

కోహ్లీ మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేశాడు...

Virat Kohli : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు. పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కూడా కోహ్లీ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులకే అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సాధించాడు. ప్రపంచ క్రికెట్‌లో మరే బ్యాటర్‌కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు.

Virat Kohli Records..

కోహ్లీ మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో కలిపి స్వదేశంలో 12 వేల పరుగులు పూర్తి చేశాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న టెస్టులో రెండో ఇన్నింగ్స్​లో 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లీ(Virat Kohli) ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కంటే ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఒక్కడే ఉన్నాడు. అయితే సచిన్‌కు ఈ ఘనత సాధించడానికి 267 ఇన్నింగ్స్‌లు అవసరం పడగా, కోహ్లీ మాత్రం 243 మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డు సాధించాడు. భారత జట్టు తరఫున కోహ్లీ స్వదేశంలో 243 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 58.84 సగటుతో 12,008 పరుగులు చేశాడు.

ఇందులో 38 సెంచరీలు, 59 అర్ధ శతకాలు ఉన్నాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్వదేశంలో 50.32 సగటుతో 14,192 పరుగులు చేశాడు. ఇందులో 42 సెంచరీలు, 70 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక, ప్రపంచవ్యాప్తంగా స్వదేశంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ (14, 192), రికీ పాంటింగ్ (13, 117), జాక్వెస్ కల్లీస్ (12, 305), కుమార్ సంగక్కర (12, 043), కోహ్లీ (12000) ఈ జాబితాలో టాప్ ఫైవ్‌లో ఉన్నారు.

Also Read : Jani Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కొత్త ట్విస్ట్

Leave A Reply

Your Email Id will not be published!