Supreme Court : నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టులో విచారణ

నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court : తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు వివాదంపై సెప్టెంబర్‌ 30వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ముందుగా దీనిపై అక్టోబర్‌ 4న విచారణ చేపడతామని సుప్రీం తెలుపగా.. తాజాగా విచారణ తేదీలో మార్పులు చేసింది. అటు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌తోపాటు బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ను కలిసి ఒకేసారి విచారించనుంది సర్వోన్నత న్యాయస్థానం.

Supreme Court Investigation..

కాగా లడ్డూ వివాదంపై నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు(Supreme Court) పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రమణ్య స్వామి సైతం సుప్రీంను ఆశ్రయించారు.

వైవీ సుబ్బారెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. లడ్డూ అంశంపై జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు వెలికి తీయాలని అన్నారు. చంద్రబాబు వేసిన సిట్‌తో నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదన్నారు. యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో ఆయన కింద పనిచేసే ఏజెన్సీలు అవే చెప్పే అవకాశం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఫుడ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Also Read : DK Aruna: అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు : ఎంపీ డీకే అరుణ

Leave A Reply

Your Email Id will not be published!