Sunita Williams : అంతరిక్షం నుంచి భూమిపైకి ఫిబ్రవరిలో రానున్న సునీతా విలియమ్స్

కాగా, క్రూ-9లో ఐఎ్‌సఎ్‌సకు చేరుకున్న హేగ్‌, అలెగ్జాండర్‌ అక్కడే ఐదు నెలలపాటు ఉండి పరిశోధనలు చేపట్టనున్నారు...

Sunita Williams : ఈ ఏడాది జూన్‌ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌(Sunita Williams), బుచ్‌ విల్‌మోర్‌లను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమి మీదకు తిరగొచ్చేందుకు లైన్‌ క్లియరైంది. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు నాసా చేపట్టిన స్పేస్‌ఎక్స్‌ మిషన్‌కు ఐఎస్ఎస్‌లో ఘనస్వాగతం లభించింది. క్రూ-9 మిషన్‌తో కూడిన రాకెట్‌ను నాసా ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరల్‌ నుంచి శనివారం ప్రయోగించగా.. ఆదివారం సాయంత్రం ఈ క్యాప్సూల్‌ ఐఎ్‌సఎ్‌సతో విజయవంతంగా అనుసంధానమైంది. డాకింగ్‌ ప్రక్రియ పూర్తికాగానే క్రూ-9 మిషన్‌లోని నాసా వ్యోమగామి నిక్‌ హేగ్‌, రష్యన్‌ కాస్మొనాట్‌ అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ ఐఎస్ఎస్‌లోకి ప్రవేశించారు. ఐఎ్‌సఎ్‌సలో ఉన్న వ్యోమగాములు వీరిని ఆలింగనం చేసుకుని ఘనస్వాగతం పలికారు. అందుకు సంబంధించిన వీడియోను నాసా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

Sunita Williams Back to…

కాగా, క్రూ-9లో ఐఎ్‌సఎ్‌సకు చేరుకున్న హేగ్‌, అలెగ్జాండర్‌ అక్కడే ఐదు నెలలపాటు ఉండి పరిశోధనలు చేపట్టనున్నారు. అనంతరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమిపైకి రానున్నారు. సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌లను కూడా దీనిలోనే భూమికిపైకి తీసుకువస్తారు. వారిద్దరూ ఈ ఏడాది జూన్‌ 6న స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రా్‌ఫ్టలో ఐఎస్‌ఎ్‌సకు వెళ్లిన సంగతి తెలిసిందే. వారు జూన్‌ 14నే తిరిగిరావాల్సి ఉండగా.. వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ఆ తర్వాత సమస్యను పరిష్కరించిన బోయింగ్‌.. స్టార్‌లైనర్‌ సురక్షితమే అని చెప్పినప్పటికీ.. నాసా అందుకు అంగీకరించలేదు. అంతరిక్షంలో చిక్కుకున్న వారికోసం స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-9ను ఐఎ్‌సఎ్‌సకు పంపింది. దీనిలో నిక్‌ హేగ్‌, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌తోపాటు.. సునీత, విల్‌మోర్‌లను కూడా తీసుకొచ్చేందుకు వీలుగా మరో రెండు సీట్లు ఖాళీగా ఉంచినట్టు నాసా తెలిపింది.

Also Read : Ap New Liquor Shops : ప్రైవేట్ మద్యం దుకాణలకు ఎక్సైజ్ శాఖ నొటిఫికేషన్

Leave A Reply

Your Email Id will not be published!